భారతదేశం, జూలై 31 -- South Central Railway Special Trains : పండుగలు, సెలవుల వేళ రైళ్లలో పెరిగే ప్రయాణికుల రద్దీని అదుపు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాగ్‌రాజ్, తిరునెల్వేలి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా వరంగల్, విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

ఈ రెండు ప్రత్యేక రైళ్లు ఇరువైపులా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లోని అనేక ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. మాణిక్‌పూర్, సత్నా, కట్ని, జబల్‌పూర్, ఇటార్సి, నాగ్‌పూర్, చంద్రపూర్, బలార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, నామక్కల్, కరూర్, దిండిగల్, మదురై, విరుదునగర్, శాతూర్, కోవిల్‌పట్టి స్టేష...