భారతదేశం, సెప్టెంబర్ 1 -- SCR Charlapalli Tiruchanur Special Trains : రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని చార్లపల్లి నుంచి తిరుపతి సమీపంలోని తిరుచానూరు వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక సర్వీసుల వల్ల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు, కోస్తాంధ్ర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది.

ఈ రెండు ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణికులకు అనువుగా పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ రైళ్లకు నిలుపుదల కల్పించారు. ఫలితంగా నల్గొండ జిల్లా వాసులతో పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రయాణికులకు కూడా నేరుగా త...