భారతదేశం, మే 7 -- Tirupati - Chhapra Special Trains : వేసవి ప్రయాణాల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు తీపి కబురు అందించింది. తిరుపతి నుంచి బీహార్‌లోని ఛప్రా జంక్షన్‌ వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ వేసవిలో సొంతూళ్లకు వెళ్లేవారికి. పర్యాటకులకు ఇది పెద్ద ఊరటనిచ్చే విషయం.

ఈ ప్రత్యేక రైళ్లు ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, డోన్, కర్నూలు సిటీ స్టేషన్లలో ఆగుతుండగా. తెలంగాణలోని గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్ నగర్, షాద్ నగర్, కాచిగూడ, మల్కాజిగిరి, కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా రాపోకలు సాగిస్తాయి. హజూర్ సాహిబ్ నాందేడ్, పూర్ణ, అకోలా, ఇటార్సీ, భోపాల్, వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ, కాన్పూర్, లక్నో, అయోధ్య కాంట్, అయోధ్యధామ్, గోరఖ్‌పూర్ స్టేషన్లలో కూడా ఆగుతాయి.

ఈ రైలు అయోధ్యధామ్ స్టే...