భారతదేశం, జూలై 20 -- South Central Railway Special Trains : ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని కాచిగూడ నుండి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచానూరు మధ్య ప్రత్యేక రైలు సర్వీసును నడపనున్నట్లు ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణించేటప్పుడు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు ,రేణిగుంట స్టేషన్లు ఉన్నాయి.

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని రకాల క్లాస్‌లను అందుబాటులో ఉంచారు. ఇందులో ఏసీ 2 టైర్ , ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ (General Second Class) కోచ్‌లు ఉంటాయి. తిరుపతి /తిరుచానూరు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసును ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది...