భారతదేశం, మే 9 -- SCR Summer Special Trains 2026 : వేసవి సెలవుల వేళ ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా. తాజాగా ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. వేసవి సెలవుల కారణంగా రైళ్లలో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు ప్రస్తుతం నడుస్తున్న పలు వీక్లీ స్పెషల్ రైళ్లను మరికొన్ని వారాల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి తమిళనాడు, కేరళ వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరట కలగనుంది.

1. నర్సాపూర్ - తిరువణ్ణామలై (రైలు నం. 07219/07220): ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరువణ్ణామలై(అరుణాచలం) వెళ్లే భక్తుల కోసం ఈ రైలును పొడిగించారు.

2. హైదరాబాద్ - కొల్లాం (రైలు నం. 07193/07194): కేరళ పర్యాటకానికి వెళ్లేవారికి, దక్షిణ భారత్ యాత్రికులకు ఈ...