భారతదేశం, సెప్టెంబర్ 10 -- South Central Railway Festival Trains : పండుగల సీజన్ ప్రారంభం కావడంతో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని యశ్వంత్‌పూర్, బీదర్ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. యశ్వంత్‌పూర్ - బీదర్ - యశ్వంత్‌పూర్ (ట్రైన్ నంబర్లు 06589 / 06590) ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 11, 12 తేదీల్లో అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణించే సమయంలో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక పరిధిలోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. యలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపూర్, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ...