భారతదేశం, జూలై 24 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ, ప్రొఫెషనల్ కళాశాలలతో పాటు విశ్వవిద్యాలయాల బంద్‌కు పలు విద్యార్థి, యువజన సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, విద్యార్థులపై దాడికి నిరసనగా ఈ రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ కొనసాగుతోందని వామపక్ష విద్యార్థి సంఘాలు చెప్పాయి.

నీట్ (NEET-UG) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు పలు కీలక డిమాండ్లతో నిరసనకు దిగాయి. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన తీవ్ర లోపాలు, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

వరుస పేపర్ లీకేజీలతో అపకీర్తి మూటగట్టుకున్న నేషనల్ టెస్...