భారతదేశం, నవంబర్ 17 -- Scene OTT Release Date: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా బ్లాక్‌బస్టర్ మూవీ 'సీన్' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 'ఆవేశం', 'రోమాంచం' చిత్రాల ఫేమ్ మలయాళ దర్శకుడు జిత్తు మాధవన్ తెరకెక్కించిన ఈ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నవంబర్ 6న థియేటర్లలో విడుదలై సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. సాక్నిల్క్ (Sacnilk) నివేదిక ప్రకారం, తొలి పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 242.05 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఊహించినదాని కంటే ముందే ఓటీటీలోకి రానుంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. 'సీన్' చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 85 కోట్లకు పైగా (కొన్ని రిపోర్టుల ప్రకారం రూ. 88 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా థియేట్రికల్ విడుదలకు, ఓటీటీ స్...