భారతదేశం, నవంబర్ 7 -- Suriya Scene 1st Day Worldwide Collection: కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద తన తిరుగులేని హవాను కొనసాగిస్తున్నారు. మలయాళంలో 'ఆవేశం' వంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు జితు మాధవన్ తమిళంలో తొలిసారి తెరకెక్కించిన 'సీన్' చిత్రం దీపావళి పండగ రేసులో బాక్సాఫీస్ విజేతగా నిలిచే సంకేతాలను ఇస్తోంది.

సూర్యతోపాటు నజ్రియా నజీమ్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీన్ సినిమా నవంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. బాక్సాఫీస్ వర్గాల గణాంకాల ప్రకారం, 'సీన్' చిత్రం మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ. 19.15 కోట్ల నికర వసూళ్లను (నెట్ కలెక్షన్స్) రాబట్టింది.

ఇందులో తమిళ వెర్షన్ నుంచే రూ. 16.15 కోట్లు రాగా, తెలుగు డబ్బింగ్ రూపంలో రూ. 3 కోట్లు వచ్చాయి. ఇక విదేశీ మార్కెట్‌లోనూ ఈ చిత్రం జోరు...