భారతదేశం, ఆగస్టు 13 -- Scam 2010 OTT Release First Look Out: ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న భారతీయ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ డ్రామా ఫ్రాంచైజీ 'స్కామ్' కొత్త సీజన్‌తో అలరించేందుకు సిద్ధమవుతోంది. 'స్కామ్ 1992', 'స్కామ్ 2003' ఓటీటీ సిరీస్‌ల ఘన విజయం తర్వాత, ఇప్పుడు 'స్కామ్ 2010' చిత్రీకరణను నిర్మాతలు అధికారికంగా ప్రారంభించారు.

జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, బిర్లా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV)లో త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

చిన్న మొత్తాల పొదుపు పథకాల నుంచి ప్రారంభమై, దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సామ్రాజ్యంగా ఎదిగిన ఒక వ్యక్తి ప్రయాణం, ఆ తర్వాత అతను ఎదుర్కొన్న చట్టపరమైన చిక్కుల నేపథ్యం...