భారతదేశం, ఆగస్టు 8 -- బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద 1,538 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్​మెంట్​ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక ఎస్బీఐ కరీర్స్ పోర్టల్ ద్వారా ఆగస్టు 7 నుంచి ఆగస్టు 27, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించవచ్చు.

ఈ ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్​మెంట్​ 2026 డ్రైవ్‌లో అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అభ్యర్థి ఒకసారి మాత్రమే ఈ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే రాష్ట్రం లేదా కేంద్రపాలిత ...