భారతదేశం, జూలై 16 -- దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస్థ అయిన 'ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్'కు చెందిన రూ. 9,795 కోట్ల ఐపీఓ సబ్​స్క్రిప్షన్ నేటితో (జులై 16) ముగియనుంది. దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) నుంచి వస్తున్న ఇష్యూ కావడంతో మార్కెట్లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఓకి చెందిన పూర్తి వివరాలను, అప్లై చేయాలా? వద్దా? అనే విషయంపై నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

ఈ మెగా ఐపీఓ కోసం కంపెనీ రూ. 545 నుంచి రూ. 574గా ప్రైస్ బ్యాండ్ నిర్ణయించింది. ఇన్వెస్టర్లు కనీసం 26 షేర్ల లాట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ ఇష్యూ ప్రారంభానికి ముందే ఈ సంస్థ యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా ఏకంగా రూ. 2,663 కోట్లు రాబట్టి తన సత్తా చాటింది. కంపెనీ తన షేర్లను గరిష్ట ధర అయిన ...