భారతదేశం, నవంబర్ 18 -- Satvika Veeravalli: ముంబయి, ఢిల్లీ నుంచి హీరోయిన్లను తీసుకొస్తారు కానీ తెలుగు అమ్మాయిలకు మాత్రం అవకాశాలు ఇవ్వరని టాలీవుడ్ పై ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి పేరు తెగ మార్మోగుతోంది. డెబ్యూ కంటే ముందే ఆమె సంచలనం క్రియేట్ చేస్తోంది.

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్. ఆమె డెబ్యూ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సాత్విక పేరు వైరల్ అవుతూనే ఉంది. తాజాగా రిలీజ్ చేసిన ఆకాశంలో ఒక తార ట్రైలర్ చూస్తే.. అరంగేట్రమే అయినప్పటికీ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ అదరగొట్టిందనేది అర్థమవుతోంది.

ఆకాశంలో ఒక తార మూవీ రిలీజ్ అయిన తర్వాత సాత్వికకు ఇంకా అవకాశాలు వస్తాయని మూవీ ఎక్స్ పెర్ట్స్ అంచనా వేశారు. కానీ ఈ సినిమా రిలీజ్ కంటే ముందే ...