భారతదేశం, మే 17 -- kaleshwaram Saraswathi Pushkaralu 2026 : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పుష్కరాలకు దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులను కల్పించనున్నట్లు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆధ్వర్యంలో పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేవాదాయ, విద్యుత్, పోలీస్, రవాణా, వైద్య ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు....