భారతదేశం, మే 15 -- Saptagiri: టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ సప్తగిరి తెలుసు కదా? అతడు ఈ మధ్య పురుష: అనే మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ఓ చిన్న సినిమా అనే నోరు జారాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇప్పుడు క్షమాపణ చెప్పాడు.

కమెడియన్ సప్తగిరి నటించిన లేటెస్ట్ మూవీ 'పురుష:'. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడాడు. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ.. ఇంతకీ రాజా సాబ్ చిన్న సినిమానా పెద్ద సినిమానా అని అడగడంతో సప్తగిరి ముందు నవ్వాడు. నన్ను పట్టుకున్నావా అక్కా అని తనదైన స్టైల్లో అన్నాడు.

ఆ తర్వాత మాట్లాడుతూ.. ఈ మధ్య కొన్ని చిన్న బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నానని చెబుతూ కొన్ని సినిమాలు పేర్లు చెప్పాను. అందులో రాజా సాబ్ ను కలిపేశాను. రియల్లీ సారీ.. క్షమించండి అని అన్నాడు....