భారతదేశం, నవంబర్ 25 -- SCR Sankranti special trains 2027 : సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే రైళ్లన్నీ నెలల ముందే నిండిపోతాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. 2027 సంక్రాంతి పండుగ సీజన్‌లో అదనపు రద్దీని క్లియర్ చేసేందుకు వివిధ ప్రాంతాల మధ్య మొత్తం 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు మంగళవారం ప్రకటించింది.

సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి స్టేషన్ల నుంచి నర్సాపూర్, శ్రీకాకుళం రోడ్, పార్వతీపురం గమ్యస్థానాలకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి..

ఈ 30 ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం సెకండ్ ఏసీ (2AC), థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్...