భారతదేశం, అక్టోబర్ 31 -- Sanjay Gupta: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు పెట్టింది పేరైన ప్రముఖ నిర్మాత, దర్శకుడు సంజయ్ గుప్తా హఠాన్మరణం చెందారు. ఆయన ముంబైలోని తన నివాసంలో బాత్రూంలో ప్రమాదవశాత్తూ జారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమై మరణించినట్లు సమాచారం.

సంజయ్ గుప్తా మరణం తాలూకు విషాద ఘటన ఇవాళ (అక్టోబర్ 31) ఉదయం వెలుగులోకి రావడంతో సినీ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు.. దీన్ని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా (Accidental Death) నమోదు చేశారు. ఇప్పటివరకు జరిగిన పోలీసు విచారణలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు గానీ, కుట్ర కోణం గానీ కనిపించలేదని స్పష్టమైంది.

సంజయ్ గుప్తా హఠాన్మరణం బాలీవుడ్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణవార్తను ప్రముఖ...