భారతదేశం, ఏప్రిల్ 26 -- Sanjay Dutt: బాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు సంచలనం సృష్టించిన యాంటీ హీరో పాత్ర 'బల్లు బలరామ్' మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. సంజయ్ దత్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన 'ఖల్ నాయక్' చిత్రానికి సీక్వెల్ వస్తోంది. 'ధురంధర్' చిత్రం తర్వాత సంజయ్ దత్ నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పేరు 'ఖల్ నాయక్ రిటర్న్స్'.

సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో 1993, ఆగస్టు 6న విడుదలైన 'ఖల్ నాయక్' అప్పట్లో ఒక సంచలనం. సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా నిలిచింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, అప్పట్లోనే రూ. 21 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి నిర్మాతలకు 400 శాతం లాభాలను తెచ్చిపెట్టింది. హిందీలోనే కాకుండా ఈ చిత్రాన్ని తెలుగు, తమ...