భారతదేశం, సెప్టెంబర్ 6 -- Sangeeth Movie: టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్ మరో కొత్త సినిమాతో థియేటర్లకు రాబోతున్నాడు. మ్యాడ్ సినిమాల్లో తన కామెడీతో ఎంటర్ టైన్ చేసిన అతను.. ఇప్పుడు క్లాసిక్ లవ్ డ్రామాతో రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీకి 'అంతా రాములోరు చూసుకుంటారు' అనే హార్ట్ టచింగ్ టైటిల్ అనౌన్స్ చేశారు.

'మ్యాడ్' సినిమాలతో అలరించిన సంగీత్ శోభన్, మలయాళ నటి అనస్వర రాజన్ తొలిసారిగా జంటగా నటిస్తున్నారు. ప్రసిద్ధ గోదావరి ప్రాంతం నేపథ్యంలో సాగే ఒక వినూత్నమైన రొమాంటిక్ డ్రామాతో వీరు అలరించడానికి సిద్ధమవుతున్నారు. 'కుమారి 21ఎఫ్', '18 పేజెస్' వంటి యూత్‌ఫుల్, ఫీల్-గుడ్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు 'అంత రాములోరు చూసుకుంటారు...