భారతదేశం, ఫిబ్రవరి 27 -- తమిళ సినీ రంగంలో 'దళపతి'గా, రాజకీయాల్లో 'టీవీకే' అధినేతగా వెలుగొందుతున్న విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు క్లిష్ట దశలో ఉంది. అతని భార్య సంగీత స్వర్ణలింగం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య ఇంతటి దూరం ఎందుకు పెరిగింది? ఎవరీ సంగీత? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

సంగీత స్వర్ణలింగం లండన్ లో స్థిరపడిన శ్రీలంక తమిళ పారిశ్రామికవేత్త కుమార్తె. 1996లో వచ్చిన 'పూవే ఉనక్కాగా' సినిమా చూసి ఆమె విజయ్‌కు వీరాభిమానిగా మారింది. లండన్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే ఆమె విజయ్‌కు అనేక లేఖలు రాసేది.

కేవలం విజయ్‌ను కలవడం కోసమే ఆమె లండన్ నుంచి చెన్నై వచ్చింది. షూటింగ్ సెట్‌లో విజయ్‌ను కలిసి అభినందనలు తెలిపిన ఆమె పద్ధతి నచ్చడంతో.. విజయ్ ఆమెను తన ఇంటికి త...