భారతదేశం, ఏప్రిల్ 9 -- Sandeep Reddy Vanga: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న 'ధురంధర్ 2: ది రివెంజ్' (Dhurandhar 2) గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రేజీ స్పై థ్రిల్లర్ పై సామాన్యులే కాదు, సినీ దిగ్గజాలు కూడా తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేరాడు. సినిమాను మెచ్చుకోవడమే కాకుండా, విమర్శలపై అతడు తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.

ధురంధర్ సినిమాపై వస్తున్న కొన్ని నెగటివ్ రివ్యూలను సందీప్ రెడ్డి వంగా తీవ్రంగా ఖండించాడు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక ఘాటు పోస్ట్ పెట్టాడు.

"కొంతమంది రచయితలు, నటులు ప్రచారాల (Propaganda) తోనే తమ కెరీర్‌లను నిర్మించుకున్నారు. అప్పుడు ఈ ఇండస్ట్రీ పిల్లిలా మౌనంగా ఉంది. ఇప్పుడు అదే గుంపు 'ధురంధర్' సినిమ...