భారతదేశం, జూన్ 15 -- Serial Heroine Sanchita Ugale Suicide: గ్లామర్ ప్రపంచంలో వెలుగుల వెనుక ఎన్నో చీకట్లు ఉంటాయనే నిజాన్ని నిరుపిస్తూ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న బుల్లితెర హీరోయిన్ సంచిత ఉగాలే (22) ఆదివారం (జూన్ 14) సాయంత్రం అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచారు.

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా పరిధిలోని నల్లసోపార ప్రాంతంలో ఉన్న తన నివాసంలో సంచిత ఉగాలే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు సోమవారం (జూన్ 15) ఉదయం వెల్లడించారు.

ఆదివారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంచిత ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అచోలే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, ప్రాథమికంగా అనుమానాస్పద అంశాలేవీ కనిపించ...