భారతదేశం, మార్చి 27 -- ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని తన తాజా చిత్రం 'కార్మేని సెల్వం' ప్రమోషన్ల కోసం ఇటీవల హైదరాబాద్ విచ్చేశారు. మార్చి 26న కార్మేని సెల్వం ట్రైలర్ రిలీజ్ చేస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్మేని సెల్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సముద్ర ఖని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, హీరోయిన్ త్రిషతో కలిసి ఒక వివాహ వేడుకలో కనిపించడంపై సముద్రఖని గతంలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో, దీనిపై హైదరాబాద్ ప్రెస్ మీట్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సముద్ర ఖని సూటిగా సమాధానమిచ్చారు.

విజయ్‌ను విమర్శిస్తూ వైరల్ అయిన ఆ వీడియో గురించి అడగగా, సముద్రఖని ఏమాత్రం తడబడకుండా స్పందించారు. "అవును, నా మనసులోని బాధను పంచుకున్నాను. ఆ సమయంలో నా మనసులోకి ఏది వస్తే అది మాట్లాడాను" ...