భారతదేశం, నవంబర్ 20 -- Sameera Reddy: 'నరసింహుడు', 'జై చిరంజీవ', 'అశోక్', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన అందాల తార సమీరా రెడ్డి. పెళ్లి, పిల్లల బాధ్యతల కోసం దాదాపు దశాబ్ద కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవలే బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ నటించిన 'ఆఖ్రీ సవాల్' (Aakhri Sawal) చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు.

తాజాగా హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి తన సినీ ప్రయాణం, కొత్తగా అమ్మలైన నటీమణుల పని గంటల చర్చ, బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమా అనుభవాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సూర్య, అజిత్, మోహన్‌లాల్ వంటి అగ్ర హీరోలతో పనిచేసిన అనుభవాలు అద్భుతమని, ఇప్పటికీ దక్షిణాది అభిమానులు తనను 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'లోని మేఘనగానే గుర్తుపెట్...