భారతదేశం, ఏప్రిల్ 4 -- ఐపీఎల్ 2026లో కుర్రాడు కుమ్మేస్తున్నాడు. 22 ఏళ్ల సమీర్ రిజ్వీ బ్యాటింగ్ లో ఊచకోత కోస్తున్నాడు. ఈ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ వరుసగా రెండో మ్యాచ్ లోనూ అదరగొట్టాడు. వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను తన బ్యాటింగ్ తో సమీర్ రిజ్వీ గెలిపించాడు.

సమీర్ రిజ్వీ బ్యాటింగ్ లో చెలరేగుతున్నాడు. శనివారం (ఏప్రిల్ 4) ముంబయి ఇండియన్స్ తో పోరులో ఈ కుర్రాడు అదిరే బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. కేవలం 51 బంతుల్లోనే 90 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 7 సిక్సర్లున్నాయి.

సమీర్ రిజ్వీ చెలరేగడంతో ముంబయి ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఐపీఎల్ 2026లో వరుసగా రెండో విక్టరీని ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలిచింది.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. సూర్యకుమార్ 51 రన్...