భారతదేశం, మే 28 -- Satyadev Samavarthi Movie Making Video Released: టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం నటనపై ఉన్న పట్టుతో వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు సత్యదేవ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, నేడు వైవిధ్యమైన సినిమాలతో హీరోగా దూసుకుపోతున్నారు. అయితే, సత్యదేవ్ నటిస్తున్న సరికొత్త మూవీకి చిత్ర యూనిట్ తాజాగా టైటిల్‌ను ఖరారు చేసింది.

సత్యదేవ్ కెరీర్‌లో 16వ సినిమాగా రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు 'సమవర్తి' అనే పవర్‌ఫుల్ పేరును పెట్టారు. టైటిల్ ప్రకటనతో పాటే చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, మేకింగ్ గ్లింప్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు 'బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి' పేరుతో విడుదల చేసిన స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ ప్రతి ఒక్కరినీ ...