భారతదేశం, అక్టోబర్ 23 -- Samantha Vijay: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయికగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం బుల్లితెరపై 'సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ తమిళం' (Celebrity MasterChef Tamil) షోకి వ్యాఖ్యాతగా సరికొత్త అవతారంలో అలరిస్తున్నారు. సోనీ విళా (Sony VIZHA), సోనీ లివ్ (Sony LIV) లో ప్రసారమవుతున్న ఈ షోలో సమంత తనదైన నైపుణ్యం, చమత్కారమైన సంభాషణలతో వీక్షకులను ఆకట్టుకుంటున్నారు.

తాజాగా రాబోయే ఎపిసోడ్‌లో 'హీరో వర్సెస్ విలన్' ఛాలెంజ్ సందర్భంగా ఆర్జే విజయ్ (RJ Vijay) సమంతను ప్రశ్నిస్తూ.. "చిత్ర పరిశ్రమలో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ స్టార్ ఎవరు?" అని అడిగారు. దీనికి సమంత ఏమాత్రం తడబడకుండా, తమిళనాడు ముఖ్యమంత్రి, సూపర్ స్టార్ సి. జోసెఫ్ విజయ్ (C. Joseph Vijay) పేరును వెల్లడించారు. అంతేకాదు కెరీర్ పీక్‌లో ఉన్నప్పు...