భారతదేశం, జూన్ 20 -- Samantha Pregnant: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు పేరు మరోసారి ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటేమో ఆమె మూవీ 'మా ఇంటి బంగారం' మూవీ సక్సెస్ కాగా.. మరొకటి సామ్ ప్రెగ్నెంట్ అనే వార్త. సమంత త్వరలోనే తల్లి కాబోతుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సమంత ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆమె త్వరలోనే తల్లి కాబోతుందనే వార్త నిజమేనని జాతీయ వార్త సంస్థ ఎన్డీటీవీ ప్రత్యేక కథనంలో ధృవీకరించింది. సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు తమ మొదటి సంతానం కోసం ఎదురుచూస్తున్నట్లు వారి సన్నిహిత వర్గాలు వెల్లడించాయని ఎన్డీటీవీ పేర్కొంది.

సమంత, రాజ్ నిడిమోరు తమ మొదటి బిడ్డను స్వాగతించబోతున్నారనే వార్త బయటకు రావడంతో సామాజిక మాధ్యమాలలో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి...