భారతదేశం, జూన్ 22 -- Samantha Pregnancy: సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా 'మా ఇంటి బంగారం' థియేటర్లలో సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో సమంత ధరించిన టీషర్ట్, జీన్స్ లుక్‌లో ఆమెకు చిన్న 'బేబీ బంప్' కనిపించడంతో సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ రూమర్స్ ఊపందుకున్నాయి. సమంత ప్రెగ్నెన్సీ వార్తలపై దర్శకురాలు నందినీ రెడ్డి స్పందిస్తూ.. ఇది ఆమె జీవితంలో ఒక బ్యూటిఫుల్ టైమ్ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు.

'మా ఇంటి బంగారం' సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కు సమంత చాలా క్యాజువల్‌గా జీన్స్, టీషర్ట్ ధరించి హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రాగానే నెటిజన్ల దృష్టి అంతా సమంత పొట్ట భాగంపై పడింది.

ఆమెకు లైట్‌గా 'బేబీ బంప్' (Baby ...