భారతదేశం, జూలై 4 -- Samantha OTT: సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లేడీ సూపర్ స్టార్ సమంత (Samantha) ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్స్ లో ఉంది. ఒకవైపు కమర్షియల్ సినిమాలు, మరోవైపు సొంత నిర్మాణ సంస్థలో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూనే.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై కూడా తన ఇంపాక్ట్ చూపిస్తోంది. తాజాగా ఓటీటీలో మరో ప్రయోగానికి సిద్ధమైంది సామ్?

'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి అంతర్జాతీయ స్థాయి సిరీస్‌లతో ఓటీటీ క్వీన్‌గా మారిన సమంత, తాజాగా డిజిటల్ దునియాలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం సోనీ లివ్ (SonyLIV) తమిళ్ విభాగంలో ఒక భారీ ఒరిజినల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతోంది.

సోనీ లివ్ తమిళ్ ఓటీటీలో సమంత ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనుంది. అయితే ఇందులో సమంత లీడ్ రోల్ ప్లే చేస్తుందా లేదా ...