భారతదేశం, జూలై 18 -- Samantha Baby Shower Photos: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే తల్లి కానున్నారు. తన వ్యక్తిగత జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తున్న ఆమె.. తాజాగా సీమంతపు వేడుకను జరుపుకున్నారు. భర్త, ప్రముఖ దర్శకుడు-నిర్మాత రాజ్ నిడిమోరుతో కలిసి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు.

పూర్తి వ్యక్తిగతంగా ఉంచాలనుకున్న ఈ వేడుకకు సంబంధించిన సమంత సీమంతం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అయి అభిమానుల్లో తెగ వైరల్ అవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సాంప్రదాయ వేడుకలో సమంత మెరూన్ కలర్ ఎత్నిక్ దుస్తుల్లో ఎంతో అందంగా మెరిసిపోయారు.

సింపుల్ మేకప్, లైట్ జ్యువెలరీతో ఆమె లుక్ క్లాసిక్‌గా ఉంది. భర్త రాజ్ నిడిమోరు కూడా సమంత దుస్తులకు మ్యాచ్ అయ్యేలా మెరూన్ కలర్ సిల్క్ కుర్తా ధరించారు. ఇద్దరూ మెడలో చిన్న పూలమాలలతో చిరున...