భారతదేశం, మే 26 -- Samantha: మా ఇంటి బంగారం అంటూ మరోసారి తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రెడీ అయిపోయింది. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మా ఇంటి బంగారం ట్రైలర్ సోమవారం (మే 25) రిలీజ్ అయింది. ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. స్టేజీపై సమంత భర్త రాజ్ నిడిమోరు మాట్లాడుతుండగా ఓ ఫ్యాన్ దూసుకొచ్చాడు. మోకాళ్లపై కూర్చుని సమంతకు పువ్వులతో ప్రపోజ్ చేశాడు. అది చూసి రాజ్ నిడిమోరు మాట్లాడటం ఆపేశాడు. పక్కనే ఉన్న శ్రీముఖి, డైరెక్టర్ నందిని రెడ్డి కూడా కంగారు పడ్డారు.

స్టేజీ పైకి ఒక్కసారిగా ఫ్యాన్ దూసుకురావడంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే అక్కడ ఉన్...