భారతదేశం, జూలై 14 -- Samantha bhagyashri: సినిమా ఇండస్ట్రీలో ఒకరు వదులుకున్న ప్రాజెక్ట్ మరొకరి వద్దకు వెళ్లడం.. అది కాస్తా బాక్సాఫీస్ వద్ద కల్ట్ క్లాసిక్‌గానో లేదా వంద కోట్ల ఇండస్ట్రీ హిట్‌గానో మారడం కొత్తేమీ కాదు. అయితే, ఇటీవల కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్ ఈక్వేషన్స్ మార్చేసిన రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల వెనుక ఉన్న 'కాస్టింగ్ ఛేంజెస్' ఇప్పుడు ఫిలిం నగర్ ఇన్‌సైడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

తెలుగు సినిమా హిస్టరీలోనే సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన ఉమెన్-సెంట్రిక్ ఫిల్మ్ 'మా ఇంటి బంగారం'. ఈ కథలోని పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ రోల్ కోసం డైరెక్టర్ మొదటి ఛాయిస్ సాయి పల్లవి. అయితే ఆ సమయంలో సాయి పల్లవి పాన్-ఇండియా ప్రాజెక్ట్స్ (రామాయణ్, తదితర చిత్రాలు) తో విపరీతంగా బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్‌ను సున్నితంగా తిరస్కరించిం...