భారతదేశం, మే 20 -- Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కోపమొచ్చింది. ఫొటోగ్రాఫర్ల తీరుపై అతను సీరియస్ అయ్యాడు. ముంబైలోని హిందుజా ఆసుపత్రి బయట పాపరాజీల (ఫొటోగ్రాఫర్ల) అతి ప్రవర్తనతో సల్మాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో, సోషల్ మీడియా వేదికగా ఆయన ఫొటోగ్రాఫర్ల తీరును తీవ్రంగా తప్పుపట్టాడు.

ఆసుపత్రి నుంచి సల్మాన్ ఖాన్ బయటకు వస్తున్న సమయంలో "భాయ్.. భాయ్" అంటూ ఫొటోల కోసం ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన క్లిప్స్ ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పలు ఫ్యాన్ పేజీల్లో వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన సల్మాన్ ఖాన్.. తీవ్ర భావోద్వేగంతో కూడిన పోస్టుల ద్వారా తన ఆవేదనను పంచుకున్నాడు. అంతే కాకుండా వార్నింగ్ కూడా ఇచ్చాడు.

మీడియా ఫొటోగ్రాఫర్లతో తనకు దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని ఈ సంద...