భారతదేశం, మార్చి 30 -- Salman Khan: టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో చేతులు కలిపాడు. అప్పుడెప్పుడో మూడేళ్ల కిందట దళపతి విజయ్ తో వారసుడు మూవీ చేసిన అతడు.. ఈసారి సల్మాన్ తో మూవీ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ సోమవారం (మార్చి 30) వచ్చేసింది. ఎప్పటినుంచో ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ.. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖానే ఈ విషయాన్ని తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి సల్మాన్ ఖాన్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఒక పోస్ట్ పెట్టి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాడు. తనదైన సిగ్నేచర్ స్టైల్‌లో "దిల్, దిమాగ్, జిగర్ సే, ఫ్రమ్ దిస్ ఏప్రిల్" అని క్యాప్షన్ పెట్టి ఈ సినిమా అప్‌డేట్ ఇచ్చాడు.

ఈ డైలాగ్ చూస్తుంటేనే సినిమాలో సల్మాన్ యాక్షన్,...