భారతదేశం, ఆగస్టు 4 -- Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇటీవలి అతను చాలా సన్నగా, లీన్‌గా కనిపించడంతో అభిమానులు సల్మాన్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అతను ఏదైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారా? అనే ప్రచారాలు కూడా సాగాయి. అయితే, ఈ రూమర్లు అన్నింటికీ సల్మాన్ ఖానే నేరుగా సమాధానమిచ్చాడు.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోలో ప్రసారమవుతున్న రియాలిటీ షో 'అలియన్స్' (Alliance) ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ సందడి చేశాడు. ఈ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న తన సోదరుడు సోహైల్ ఖాన్ (Sohail Khan) ను కలిసేందుకు వచ్చిన భాయిజాన్, తన ఫిట్‌నెస్ సీక్రెట్‌తో పాటు బరువు తగ్గడం వెనుక ఉన్న అసలు నిజాన్ని వెల్లడించాడు.

'అలియన్స్' షోలో సోహైల్ ఖాన్‌తో సల్మాన్ జరిపిన సరదా సంభాషణకు సంబంధించ...