భారతదేశం, ఆగస్టు 3 -- Salman Khan: బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టమైన రోజులను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెలికాస్ట్ అవుతున్న పాపులర్ రియాలిటీ షో 'అలయన్స్' (Alliance) సెట్స్‌లో తన సోదరుడు సోహైల్ ఖాన్ కోసం అడుగుపెట్టిన సల్మాన్.. జైలు గోడల మధ్య తాను అనుభవించిన దారుణమైన పరిస్థితులపై సంచలన కామెంట్స్ చేశారు.

కటకటాల వెనుక తాను ఎదుర్కొన్న నరకం గురించి సల్మాన్ చెప్పిన విషయాలు ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

రియాలిటీ షో ప్రోమోలో సల్మాన్ ఖాన్ తన పాత జైలు జీవితం గురించి మాట్లాడుతూ అక్కడ వాతావరణం ఎంత దారుణంగా ఉండేదో వివరించారు. కటకటాల వెనుక ఓ చిన్న గదిలో 50 నుంచి 70 మంది ఖైదీలను ఒకేసారి ఉంచేవారని తెలిపారు. అందరికీ కలిపి కేవలం ...