భారతదేశం, సెప్టెంబర్ 20 -- Salman Khan: రియాలిటీ షో బిగ్ బాస్ 20 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్‌లో హోస్ట్, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ పపరాజీల (ఫొటోగ్రాఫర్లు) తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈవెంట్లలో మహిళా నటీమణులతో పాటు తన మేనకోడలిని వెనుక నుంచి అసభ్యకర కోణాల్లో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో 'ఎవరో గుర్తుపట్టండి' అంటూ క్యాప్షన్లు పెట్టే ఫోటోగ్రాఫర్ల వికృత మనస్తత్వాన్ని ఎండగట్టారు.

బిగ్ బాస్ 20 వేదికగా సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ, డిజిటల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పబ్లిక్ ఈవెంట్లు, పార్టీలలో హీరోయిన్లు, విమెన్ సెలబ్రిటీల ప్రమేయం లేకుండా వారిని వెనుక వైపు నుండి కెమెరాల్లో బంధిస్తూ, అసభ్యకరంగా విజువల్స్ క్రియేట్ చేస్తున్న పపరాజీల తీరును సల్మాన్ తీవ్రంగా నిరసించారు.

ఇటీవల తన మేనకోడలు నడుచుకుంటూ వెళ్...