భారతదేశం, జూన్ 10 -- Salesforce Layoffs: గ్లోబల్ టెక్ రంగంలో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ సేల్స్‌ఫోర్స్ (Salesforce) మరోసారి ఉద్యోగాల కోతకు తెరలేపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఐటీ ఇంటిగ్రేషన్, మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడింది. కాలిఫోర్నియా నియంత్రణ సంస్థల ఫైలింగ్ ప్రకారం ప్రస్తుతానికి 86 మందిని తొలగించినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక వెల్లడించింది. బాధితులకు కంపెనీ భారీ పరిహారాన్ని ప్రకటిస్తోంది.

కంపెనీ ప్రతిష్టాత్మకంగా భావించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్ 'ఏజెంట్‌ఫోర్స్' (Agentforce), ఐటీ ఇంటిగ్రేషన్ ప్లాట్‌ఫామ్ 'మ్యూల్‌సాఫ్ట్' (Mulesoft), మార్కెటింగ్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ విభాగాల్లో ఈ లేఆఫ్స్ జరిగాయి. తొలగించిన వారిలో సేల్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్,...