Saiyami Kher: అది తీసేసి ప్లాస్టిక్ బొమ్మల మారమన్నారు.. సాయి ధరమ్ తేజ్ రేయ్ హీరోయిన్ సయామీ ఖేర్ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 17 -- Saiyami Kher About Appearance And Curly Hair: చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా రాణించాలంటే కొన్ని విషయాలకు లోబడి నడుచుకోవాలనే ఒత్తిళ్లు ఉండటం కొత్తేమీ కాదు. గ్లామర్, శారీరక రూపురేఖలు, వేసుకునే బట్టల విషయంలో హీరోయిన్లపై తరచూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఈ క్రమంలోనే తనకు ఎదురైన చేదు అనుభవాలను, పరిశ్రమలోని విచిత్రమైన సలహాలను ప్రముఖ నటి సయామీ ఖేర్ తాజాగా పంచుకున్నారు.
తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన పరిస్థితులపై సయామీ ఖేర్ మాట్లాడుతూ, అనేక మంది మేనేజర్లు తనకు చిత్ర విచిత్రమైన ఉచిత సలహాలు ఇచ్చారని తెలిపారు. ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఎలా ఉండాలో అలాగే కనిపించాలని, వేషధారణ సైతం అదే విధంగా మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. చివరికి తన సహజమైన ఉంగరాల జుట్టును (Curly Hair) కూడా మార్చుకోవాలని సూచించారని సయామీ వెల్లడి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.