భారతదేశం, ఆగస్టు 15 -- Sairabanu: టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్, బంధవి శ్రీధర్ (Bandhavi Sridhar) జంటగా నటిస్తున్న సినిమా 'సైరాబాను'. ఇవాళ (ఆగస్టు 15) ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన నిమిషాల్లోనే డిజిటల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న సందర్భంగా విడుదల చేసిన ఫన్నీ బీటీఎస్ (BTS) వీడియో సినిమాపై ఆసక్తిని రేపగా, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా స్టోరీపై ఓ క్లారిటీనిచ్చింది.

శనివారం రిలీజ్ చేసిన సైరాబాను మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. బైక్ నడుపుతున్న హిందూ యువకుడిగా ఆది సాయికుమార్, అతని వెనుక సాంప్రదాయ ముస్లిం దుస్తుల్లో కూర్చున్న యువతిగా బంధవి శ్రీధర్ కనిపించిన ఈ పిక్చర్ సినిమా మూడ్‌ను స్పష్టం చేస్తోంది. ఇద్దరి మధ్య నడిచే ఎమోషనల్ లవ్ స్టోరీ మూవీకి కీలకం కానుంది.

''ఎంటర్ టైన్మెంట్ గ్యారెంటీ. మిమ్...