భారతదేశం, ఏప్రిల్ 28 -- Sai Pallavi Trolls: సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటి సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్న ఏక్ దిన్ మూవీతో హిందీ ఇండస్ట్రీలోకి వెళ్తోంది. దీని తర్వాత నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణం' మూవీలోనూ ఆమె సీతాదేవి పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా ముంబైలో జరిగిన 'ఏక్ దిన్' మూవీ ప్రమోషన్లలో సాయి పల్లవి హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ ఈవెంట్‌లో సాయి పల్లవి తనకు హిందీ అంతగా రాదని ఒప్పుకుంటూనే.. వచ్చీ రాని హిందీలో మాట్లాడింది. ఇది చూసిన కొందరు నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తున్నారు.

"కనీసం హిందీ సరిగ్గా మాట్లాడలేని నటిని సీతాదేవి పాత్రకు ఎలా ఎంపిక చేశారు? నితీష్ తివ...