భారతదేశం, అక్టోబర్ 27 -- Sai Pallavi: తనదైన సహజ నటన, అద్భుతమైన డాన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు మునుపెన్నడూ చూడని సరికొత్త ఛేంజోవర్‌తో షాక్ ఇస్తోంది. నితేష్ తివారీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న 'రామాయణం' సినిమాలో ఆమె సీతాదేవిగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓం మూవీలో పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ గా అవతారమెత్తింది.

రామాయణం సినిమాలో సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ పవిత్రమైన క్యారెక్టర్ ను అంతే భక్తిభావంతో ప్లే చేస్తోంది. ఈ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఆమె ఎంతో రీసెర్చ్ చేసి, హోమ్ వర్క్ కూడా చేసింది. అయితే రామాయణం తర్వాత ఆమె ఎలాంటి రోల్ చేస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు, పూర్తిగా ఊహించని విధంగా కమర్షియల్ యాక్షన్ డ్రామాలో రఫ్ అండ్ టఫ్ పోలీస్‌గా దర్శనమిచ్చి థ్రిల్ చేసింది.

టాలెంటె...