భారతదేశం, సెప్టెంబర్ 29 -- Sai Pallavi: ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ 'రామాయణం'. ఈ సినిమా నుంచి రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు కానుకగా బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియోలో శ్రీరాముడి పాత్ర కోసం రణ్‌బీర్ కపూర్ పడిన శ్రమ, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, కత్తిసాము, విలువిద్య సాధన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.

"నాకు శ్రీరాముడి పాత్ర లభించడం కేవలం ఒక సినిమా ఆఫర్ మాత్రమే కాదు. ఇది కోట్ల మంది నమ్మకానికి, భావోద్వేగానికి సంబంధించిన ఒక పెద్ద బాధ్యత" అని రణ్‌బీర్ కపూర్ తెలిపాడు. హాలీవుడ్ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ టెర్రీ నోటరీ ఆధ్వర్యంలో రణ్‌బీర్ ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన యాక్షన్ అండ్ స్టంట్ శిక్షణ పొందాడు.

ఈ రామాయణం చిత్రంలో సీతాదేవిగా నటిస్తున్న సాయి పల్లవి.. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి ల...