భారతదేశం, అక్టోబర్ 15 -- Sai Pallavi: సాయి పల్లవి.. పెద్దగా అందం లేకపోయినా, గొంతు బాగా లేకపోయినా, ఈకాలం హీరోయిన్లలా స్కిన్ షో చేయకపోయినా సౌత్ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా ఆమె జగపతి బాబు పాపులర్ షో జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 తొలి ఎపిసోడ్ కు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆ ఓటీటీ రిలీజ్ చేసింది. అయితే ఇందులో రణ్‌బీర్ కపూర్ ఆమెకు పంపిన స్పెషల్ సందేశం వైరల్ అవుతోంది.

జగపతి బాబు షో జయమ్ము నిశ్చయమ్మురా రెండో సీజన్ కు వచ్చిన సాయి పల్లవి తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకుంది. ప్రేమమ్ మూవీ తర్వాత ఫేస్ బుక్ డీపీల్లో తన ఫొటో పెట్టుకోవడం చూసి షాకయ్యానని ఆమె చెప్పింది. ఇక అప్పట్లో తన ముఖం కూడా అంత బాగా లేదని, చాలా మొటిమలు ఉండేవని వెల్లడించింది. తన గొంతు కూడా మగాళ్ల గొంతులాగా ఉండేదని, రూమ్ సర్వీస్ కు కాల్ చేస్తే చ...