భారతదేశం, జూలై 22 -- Sai Pallavi: మేజర్ ముకుంద్ వరదరాజన్ వీర మరణం, ఆయన జీవిత కథ ఆధారంగా రూపొందిన 'అమరన్' చిత్రం ఎంతో స్పెషల్. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ మూవీ.. తాజాగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో ఏకంగా మూడు పురస్కారాలు సొంతం చేసుకుంది. దీనిపై సాయి పల్లవి ఎమోషనల్ అయింది.

అమరన్ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డులకు ఎంపికయ్యాడు దర్శకుడు రాజ్‌కుమార్. ఈ నేపథ్యంలో అతను చేసిన పోస్ట్‌పై రిప్లై ఇస్తూ సాయి పల్లవి ఎంతో ఎమోషనల్ ట్వీట్ చేసింది.

"నా హృదయం సంతోషంతో నిండిపోయింది. ఇది సులువైన ప్రయాణం కాదు. మీరు చెప్పాలనుకున్న కథపై అపారమైన గౌరవంతో ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఈ పోస్టు రాస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఇక్కడివరకూ మీ ప్రయాణంలో సాక్షిగా ఉన్నా. ఎంతో గర్వంగా ఉంది రాజ్ కుమార్ సర్. మీ విజయాన్...