భారతదేశం, నవంబర్ 3 -- Sai Dharam Tej Wedding: మెగా మేనల్లుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ఓ మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. అయితే చాలా కాలంగా ఆయన పెళ్లి గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి సైతం కొన్ని సినిమా వేదికల మీద సాయి తేజ్‌కు త్వరగా పెళ్లి చేయాలని ఉందని సరదాగా కామెంట్స్ చేశారు.

ఎట్టకేలకు ఈ రూమర్లకు, మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులకు చెక్ పెడుతూ సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యాడు. తన పెళ్లి వార్తలపై గతంలోనే హింట్ ఇచ్చిన ఆయన, ఈ ఏడాదే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం.. చాలా ఏళ్లుగా తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, సాయి ధరమ్ తేజ్ తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడు. రిపోర్ట్స్ ప్రకారం నవంబర...