భారతదేశం, మే 5 -- Sabja seeds vs Chia Seeds : ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు చియా సీడ్స్, సబ్జా గింజలు కనిపిస్తున్నాయి. ఈ రెండూ కూడా బరువు తగ్గడానికి సాయపడతాయని మనం వింటుంటాం. కానీ ఇవి శరీరంలో చేసే పనులు పూర్తిగా భిన్నం. అసలు ఈ రెండింటిలో ఏది దేనికి పనికొస్తుంది? సైన్స్ ఏం చెబుతోంది? అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

చియా సీడ్స్ అనేవి కేవలం పీచు పదార్థానికే కాదు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లకు కూడా నిలయం. వీటిని నీటిలో నానబెట్టినప్పుడు అవి ఒక జిగురు లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఇది మనం తిన్న ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

శాస్త్రీయ ఆధారాలు: 'The Journal of Nutrition' ప్రచురించిన కథనం ప్రకారం.. అధికంగా ఫైబర్ (పీచు) తీసుకునే వారు క్యాలరీ కంట్రోల్ డైట్‌ను ఎక్కువ కాలం పాటించగలుగుతారు.

పొ...