భారతదేశం, నవంబర్ 28 -- 2026-27లో శబరిమల మండలం-మకరవిళక్కు యాత్ర చేపట్టే యాత్రికులకు సహాయం చేయడానికి కేరళం పోలీసులు 24 గంటల హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. భక్తులు సహాయం కోసం 14432కు డయల్ చేయవచ్చు. అయితే కేరళం వెలుపల నుండి కాల్ చేసేవారు 04735-14432 నంబర్‌పై హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.

ఈ హెల్ప్‌లైన్ తప్పిపోయిన వారిని గుర్తించడం, రోడ్డు ప్రమాదాలకు స్పందించడం, వాహనాలు పాడైపోతే వాటిని సరిచేయడం, నిలిచిపోయిన వాహనాలను నీలక్కల్‌కు తరలించడానికి రికవరీ వాహనాలను ఏర్పాటు చేయడంలో యాత్రికులకు సహాయం చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే శబరిమల వెళ్లినప్పుడు చాలా మంది భక్తులు పైన చెప్పిన సమస్యలు వస్తే ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడతారు. అదే హెల్ప్‌లైన్ నెంబర్‌కి కాల్ చేసి మీ సమస్య చెబితే బయపడవచ్చు.

అంతేకాదు హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా అత్యవసర వైద్య ...