భారతదేశం, జూలై 12 -- S Janaki Last Video: భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక అపురూపమైన, దైవికమైన అధ్యాయం ముగిసింది. కోట్లాది మంది అభిమానులు 'జానకమ్మ' అని ఆప్యాయంగా పిలుచుకునే వెటరన్ సింగర్ ఎస్.జానకి శనివారం (జూలై 11) కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన 88వ ఏట తుదిశ్వాస విడిచిన జానకమ్మ చివరి వీడియో వైరల్ గా మారింది.

వేలాది పాటలతో సంగీత ప్రియులను సమ్మోహనపరిచిన సంగీత శిఖరం మన జానకమ్మ. ఇప్పుడు ఆమె ప్రాణాలతో లేరనే వార్త జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. అయితే ఈ సమయంలో జానకి చివరి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పాటలే ప్రాణంగా సాగిన ఆమె.. ఆ వీడియోలోనూ పాటలను వింటూ సంతోషంతో మురిసిపోయారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో జానకమ్మ కోసం సింగర్ సునీత పాటలు పాడటం కనిపిస్తోంది. జానకమ్మ ఇంట్లోనే ఓ చిన్నపాటి సంగీత విభావరిలా ఇది సాగింది. జానకమ్మ కాళ...